ETV Bharat / state

తగ్గిన పుష్పగుచ్ఛాల ప్రాధాన్యం.. సాగని పూల వ్యాపారం

కరోనా దెబ్బ నూతన సంవత్సర వేడుకల మీద కూడా పడింది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ..పుష్ప గుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పటం ఆనవాయితీ. కానీ వైరస్​ కారణంగా పుష్పాలు ఇచ్చుకునే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో సీజనల్​గా పూల వ్యాపారం చేసుకునే వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. నూతన సంవత్సరం వస్తే కళ కళలాడే పూల బొకేల దుకాణాలు కొనుగోలుదారులు లేక కళావిహీనంగా కనిపిస్తున్నాయి.

flower bouquets
సాగని పూల వ్యాపారం
author img

By

Published : Dec 31, 2020, 5:38 PM IST

కరోనా కారణంగా దెబ్బతిన్న వాటిల్లో పూల వ్యాపారం కూడా ఒకటి. నూతన సంవత్సర వేడుకల్లో పుష్పాలు, పుష్ప గుచ్ఛాలు ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం ఉంది. పెద్దలకు, రాజకీయ ప్రముఖలకు, ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు... బొకేలు, గ్రీటింగ్‌ కార్డులు, పండ్లు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వైరస్​ దెబ్బకు పూలు ఇచ్చుకునే పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పూల వ్యాపారులతో 'ఈటీవీ భారత్​ ప్రతినిధి' మాట్లాడారు.

కరోనా ప్రభావంతో నూతన సంవత్సర వేడుకల్లో తగ్గిన పూల ప్రాధాన్యత

సాధారణంగా డిసెంబర్‌ 31 ఉదయం నుంచే పూల వ్యాపారం జోరుగా సాగుతుందని వ్యాపారులు చెప్పారు. ముందు రోజు నుంచే బొకేల తయారీలో కార్మికులు బిజీగా ఉంటారని పేర్కొన్నారు. పుష్పగుచ్ఛాలు అందంగా డెకరేషన్‌ చేసి మార్కెట్‌లో పెడతామని, వీటి తయారీ కోసం పూలు, ఆకులు, కొమ్మలు వంటి సామగ్రి అంతా బెంగుళూరు నుంచే తీసుకువస్తామని తెలిపారు. నూతన సంవత్సరానికి రెండు వారాల ముందు నుంచే బొకేల తయారీ పనుల్లో నిమగ్నమై ఉంటామన్నారు.

లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా, బొకేలు తయారీ కోసం కోల్​కతా, హైదరాబాద్‌ నుంచి కళాకారులను తీసుకువస్తుంటామని దుకాణాదారుడు తెలిపారు. ఏటా ఈ వ్యాపారంతో మంచి లాభాలు గడిస్తుంటాం.. కానీ ఈ సంవత్సరం పరిస్థితి తారుమారైందని ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం కావస్తున్నా.. కొనుగోళ్లు ప్రారంభమే కాలేదని వ్యాపారులు వాపోతున్నారు. తగినంత గిరాకీ లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు.

"ఈ ఏడాది బెంగుళూరులో పూల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత సంవత్సరంతో పోల్చితే రెండు, మూడు రెట్లు పెరిగాయాయి. భారీ మొత్తంలో కొనుగోలు చేసి.. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించాం. పూల గుచ్చాలు తయారు చేసి మార్కెట్​లో అమ్మకానికి పెట్టాం. కానీ అందుకు తగ్గ వ్యాపారం జరగటం లేదు. కరోనా భయానికి కొనుగోలు చేయటం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుని పుష్పగుచ్చాలు ఇచ్చిపుచ్చుకుంటే ప్రమాదమేమి ఉండదు" -పూల దుకాణదారుడు

ఇదీ చదవండి: సరికొత్త లక్ష్యాలతో 2021కి ఆహ్వానం పలుకుతున్న యువత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.