ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో శానిటైజర్​ తాగి తొమ్మిది మంది మృతి

ప్రకాశం జిల్లాలో శానిటైజర్​ తాగి  తొమ్మిది మృతి

author img

By

Published : Jul 31, 2020, 8:32 AM IST

Updated : Jul 31, 2020, 12:05 PM IST

08:25 July 31

నిన్న అర్ధరాత్రి ముగ్గురు.. ఇవాళ మరో ఆరుగురు

ప్రకాశం జిల్లాలో శానిటైజర్​ తాగి తొమ్మిది మంది మృతి

 ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి తొమ్మిది మంది మృతిచెందారు. మద్యానికి బానిసైన వీరు.. లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసివేయడంతో .. శానిటైజర్ సేవించారు. అధిక మొత్తంలో శానిటైజర్ తీసుకోవడంతో తీవ్రమైన కడుపునొప్పితో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కురిచేడుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 రోజులుగా లాక్ డౌన్ విధించారు. ఫలితంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మద్యం దొరక్కపోవడంతో మొత్తం 20 మంది కలిసి శానిటైజర్‌ తాగేందుకు అలవాటు పడినట్లు సమాచారం. 10 రోజులుగా శానిటైజర్‌ సేవించడంతో తీవ్రమైన కడుపునొప్పితో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిన్న అధిక మొత్తంలో శానిటైజర్ సేవిచండంతో తొలుత ఒకరి చనిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా రాత్రికి ముగ్గురు కన్నుమూయగా....తెల్లవారే సరికి ఈ సంఖ్య 9కు పెరిగింది. మృతుల్లో ఇద్దరు యాచకులు ఉండగా.. ఇద్దరు వృద్ధులు ఉన్నారు. అనుగొండ శ్రీను, భోగేమ్ తిరుపతయ్య, గుంటక రామిరెడ్డి, కడియం రమణయ్య, కొనగిరి రమణయ్య, రాజారెడ్డి, బాబు , ఛార్లెస్‌ , అగస్టీన్‌ మృతి చెందారు. 

కురిచేడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు.  10 రోజులుగా శానిటైజర్‌ తాగుతున్నట్లు కుటుంబసభ్యులు చెప్పినట్లు ఎస్పీ వివరించారు. చుట్టుపక్కల విక్రయిస్తున్న శానిటైజర్స్‌ సీజ్ చేసి పరీక్షలకు పంపిస్తామని ఎస్పీ వెల్లడించారు. శానిటైజర్స్ నేరుగా తాగారా లేదా వేరే ద్రవంతో కలిపి తాగారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. 

ఇదీ చూడండి

180 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Last Updated : Jul 31, 2020, 12:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.