చెత్త రహిత పట్టణాల ఎంపికలో ప్రకాశం జిల్లా చీరాలకు వన్ స్టార్ రేటింగ్ లభించింది. 2019-2020 సంవత్సరానికి హౌసింగ్ అర్బన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గార్బేజి ఫ్రీ సిటీ (జె.ఎఫ్. సీ) స్టార్ రేటింగ్ ప్రక్రియ చేపట్టారు. రాష్ట్రం నుంచి మొత్తం 110 మున్సిపాలిటీలు పోటీపడగా చీరాలతో పాటు మరో మూడు మాత్రమే వన్ స్టార్ రేటింగ్ పొందాయి.
వాటిల్లో విశాఖపట్నం, పలమనేరు, సత్తెనపల్లి పట్టణాలున్నాయి. శానిటరీ ఇన్స్పెక్టర్లు, పురపాలక సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాల ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రా రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: