తాగునీటి సరఫరాలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను హెచ్చరించారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో ఉపాధిహామీ పథకం, నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ట్యాంకర్ల సంఖ్య పెంచాలన్నారు. పెండింగ్లో ఉన్న రూ.4 కోట్ల బకాయిలు విడుదల అయ్యాయని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామి కూలీల సంఖ్య పెంచి ఆర్థికంగా కూలీలను ఆదుకోవాలన్నారు.
ఇదీ చదవండీ...