ETV Bharat / state

కురిచేడు ఘటన.. నిందితుడు చదివింది ఆరు.. చేసేది శానిటైజర్ల తయారీ..! - ప్రకాశం జిల్లా వార్తలు

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేశామని ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ అన్నారు. శానిటైజర్ తాగిన 50 మందిని గుర్తించి చికిత్స అందించి కాపాడామన్నారు. పలు శానిటైజర్‌ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. పర్‌ఫెక్ట్‌ అనే బ్రాండ్‌ శానిటైజర్‌ను హైదరాబాద్ జీడిమెట్లలో అనుమతులు లేకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. పర్‌ఫెక్ట్‌ అనే బ్రాండ్‌ శానిటైజర్‌ నమూనాలను సెంట్రల్ డ్రగ్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 10 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.

కురిచేడు ఘటనను ఛేదించిన పోలీసులు.. 10 మంది అరెస్ట్

author img

By

Published : Aug 11, 2020, 5:23 PM IST

Updated : Aug 11, 2020, 11:02 PM IST

ప్రకాశం జిల్లా కురిచేడులో జులై 29, 30, 31 తేదీల్లో శానిటైజర్లు తాగి 16 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. తప్పుడు విధానంలో నకిలీ ఫార్ములా, నకిలీ కంపెనీతో శానిటైజర్లు తయారుచేసి మార్కెట్‌ చేసిన ప్రధాన నిందితుడితో పాటు, వీటిని విక్రయించి.. సరఫరా చేసిన డీలర్లతో కలిపి మొత్తం 10 మందిని అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్‌ వెల్లడించారు.

యూట్యూబ్ పరిజ్ఞానంతో శానిటైజర్లు తయారీ

తెలంగాణలోని హైదరాబాద్ నగరం‌ జీడిమెట్లలో తయారుచేసిన నకిలీ శానిటైజర్లు ఇంతమంది ప్రాణాలు బలిగొన్నాయని ఎస్పీ తెలిపారు. కరోనాతో శానిటైజర్ల వినియోగం పెరగడంతో ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతోనే... శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకున్న అవగాహన, యూట్యూబ్‌ సాయంతో పర్‌ఫెక్ట్‌ గోల్డ్‌ అనే నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ శానిటైజర్ల వల్ల దారుణం జరిగిందని చెప్పారు.

మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం గత 10 రోజులుగా సమగ్ర దర్యాప్తు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇందుకోసం 4, 5 శానిటైజర్ల కంపెనీలను పరిశీలించామని, హైదరాబాద్‌, బెంగళూరు, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమ బృందం సమగ్ర దర్యాప్తు నిర్వహించగా, ఇందులో పర్‌ఫెక్ట్‌ గోల్డ్ కంపెనీ వ్యవహారం బయటకు వచ్చిందన్నారు.

ఆరో తరగతి చదివిన హైదరాబాద్‌ ప్రశాంత్ నగర్‌కు చెందిన సాలె శ్రీనివాస్‌ అనే వ్యక్తి వీటిని తయారు చేస్తున్నాడని దర్యాప్తులో గుర్తించామన్నారు. గతంలో పెట్రోల్‌ బంకులో పనిచేసి, కొన్నాళ్లు పెయింట్‌ రిమూవర్స్‌ అమ్మడం వంటి పనిచేసిన శ్రీనివాస్​కు రసాయన ఫార్ములాల మీద కొంత అవగాహన ఉందన్నారు. ఈ అవగాహనతో కొవిడ్‌ సమయంలో శానిటైజర్లకు విపరీతమైన గిరాకీ రావడంతో.. వీటిని తయారు చేయాలని భావించి జీడిమెట్లలో కంపెనీ పెట్టాడని ఎస్పీ తెలిపారు.

మిథనాల్ వినియోగం వల్లే

తక్కువ ధరకు లభించే మిథనాల్​తో వీటిని తయారుచేస్తున్నారని ఎస్పీ చెప్పారు. సాధారణంగా శానిటైజర్ల తయారీకి ఇథనాల్ వినియోగిస్తారన్నారు. మిథనాల్‌ వినియోగంతో కొంతమంది మద్యం ప్రియులు వీటిని తాగుతున్నారని వివరించారు. ఈ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవని, కాలం చెల్లిన రిజిస్ట్రేషన్‌ నెంబర్​తో లేబుళ్లు తయారుచేసి మార్కెట్లోకి అమ్ముతున్నారని గుర్తించామని ఎస్పీ తెలిపారు.

తొలుత ఆటోల్లో శానిటైజర్ విక్రయించేవారని, తర్వాత కేశవ్‌ అగర్వాల్‌ అనే వ్యక్తితో చేతులు కలిపి శానిటైజర్లను డిస్ట్రిబ్యూషన్‌ చేసేవారన్నారు. తప్పుడు పేరుతో కంపెనీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న వాణిజ్య పన్నులశాఖ అధికారులు రెండుసార్లు దాడులు చేయగా, వారితో అవగాహన చేసుకుని కేసుల్లేకుండా చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. తక్కువ ధరకు వస్తుందని మెడికల్‌ షాపుల వాళ్లు కూడా వీటిని అమ్మకాలు చేశారని ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ తెలిపారు.

శానిటైజర్ల అమ్మకానికి రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ చూడకుండా, అనుమతులు ఉన్నాయో లేవో పరిశీలించకుండా విచ్చలవిడిగా విక్రయాలు చేపట్టారు. అందువల్ల తయారీదారుడు శ్రీనివాస్‌ రావుతో పాటు, వీటిని డిస్ట్రిబ్యూట్‌ చేసిన వ్యక్తులను, మెడికల్‌ దుకాణాల యజమానులను మొత్తం 10 మందిని అరెస్టు చేశాం. వీరిలో ప్రాణాంతకమైన రసాయనిక పదార్థాలను అక్రమ మార్గంలో విక్రయించిన మహమ్మద్‌ దావూద్‌, మహమ్మద్‌ హాజి, కేశవ్‌ అగర్వాల్‌, సాలే శివకుమార్‌లు కూడా ఉన్నారని, మిగిలిన వారు మెడికల్‌ దుకాణ యజమానులున్నారు.--- సిద్ధార్ద్ కౌశల్, ఎస్పీ

--

ఇదీ చదవండి:

సీఎం జగన్.. విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్: లోకేశ్

Last Updated : Aug 11, 2020, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.