ETV Bharat / state

హైటెక్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు... 17 మంది అరెస్టు - prakasam police

ఒంగోలు కేంద్రంగా బెట్టింగ్​లకు పాల్పడుతున్న ఓ ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఓ కమ్యూనికేటర్, భారీగా నగదు, సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టు
author img

By

Published : Oct 2, 2019, 9:09 PM IST

హైటెక్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ల నిర్వహణ, వ్యాపార అభివృద్ధికి కొంతమంది యువకుల నియామకం వంటి అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కొమ్మిశెట్టి రమేశ్ కొంతమంది సభ్యులతో కొద్ది కాలంగా క్రికెట్‌, ప్రో కబడ్డీ వంటి క్రీడల్లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ, మధ్య ,పేద యువకులను గుర్తించి వారిని నమ్మించి ఈ బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తున్నాడు. పూసపాటి లక్ష్యయ్య అనే పాత నేరస్థుడిని కలిసేందుకు రమేశ్, అతని ముఠాలో 16 మంది ఇవాళ ఒంగోలు వచ్చారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వలపన్ని వీరని అదుపులో తీసుకున్నారు. వీరంతా ఒంగోలు పట్టణంలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ రెండు రాష్ట్రాల యువకులతో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తమ అక్రమ వ్యాపారాన్ని మరికొంత మందికి చేరువ చేసేందుకు కొత్త వారిని సభ్యులుగా నియమించే కార్యక్రమం కూడా చేపట్టినట్లు పోలీసులు గుర్తించి సోదాలు నిర్వహించారు. బెట్టింగ్‌లకు వినియోగించే ఒక కమ్యూనికేటర్‌, మొబైల్‌ ఫోన్లు, రెండు ల్యాప్​టాప్‌లు, 16.11లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 మందిని అరెస్టు చేశారు.

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పల నాయుడు హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ ఆశలపై మాట్లాడారు .వైకాపా కార్యాలయం లో కూడా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన సదస్సు కూడా జరిగింది.

Body:పురపాలక ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం జరిగింది .కోటి చెరువు పరిధిలో పురపాలక కమిషనర్ నాయుడు, వార్డు వాలంటీర్లు ,అధికారులు కలిసి మొక్కలు నాటారు ,గట్టుపై ఉన్న మొత్తం మొక్కలను తొలగించారు

Conclusion:అదే విధంగా పలు వార్డుల్లో కూడా గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలవేసి
నివాళి అర్పించారు .ఆశయాల్ని ఆశయాల్ని కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అలాగే ప్రభుత్వ ఐటిఐ లో కొత్తగా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.