ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులకు ఉపయోగించే వాహనం కొంతకాలం నుంచి మూలనపడి ఉంది. ప్రజాధనంతో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ యంత్రాన్ని శంఖవరం సమీపంలోకి తరలించారు. నిర్లక్ష్యంగా వదిలేసిన ఈ యంత్రం చుట్టు చెట్లు పెరిగి పాడవుతోంది. దీని గురించి... "తుప్పు పాలవుతున్న ప్రజాధనం.. నిర్లక్ష్యం పట్ల ప్రజల ఆగ్రహం" అనే శీర్షికన 'ఈటీవీ భారత్' కథనం ఇచ్చింది. కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ నారాయణరావు 'ఈటీవీ భారత్' కథనానికి స్పందించారు. నిర్లక్ష్యంగా ఉంచిన వాహనాన్ని నగర పంచాయతీ కార్యాలయానికి చేర్చారు. దానికి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకొస్తామని కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి: