ప్రకాశం జిల్లా దర్శిలోని పుచ్చలమెట్ట ప్రాంతంలో ఒక కరోనా కేసు నమోదైంది. దీంతో దర్శి పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతను ఇటీవల మహారాష్ట్ర వెళ్లి వచ్చాడు. అతన్ని క్వారంటైన్‌కి తరలించి.. నేడు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చింది. అతన్ని కొవిడ్ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి... ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ప్రాణం కాపాడిన పోలీసులు