అమూల్ సంస్థకు పాలు పోస్తున్న రైతులకు బిల్లుల చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులకు సూచించారు. జిల్లాలో అమూల్ ప్రాజెక్ట్ పురోగతిపై స్థానిక ప్రకాశం భవన్‌లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆ సంస్థ ప్రతినిధులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలతో కల్తీ పాలను చాలా వరకు కట్టడి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
గతంలో కొన్ని సొసైటీల్లో జరిగిన లోపాలు వలన ఏఎంసీయూల, డాక్ వద్ద నమోదైన విలువల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున బకాయిల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో జేసీ టీ.ఎస్.చేతన్, పశు సంవర్ధకశాఖ జేడీ బేబిరాణి, అమూల్ ప్రాజెక్ట్ నోడల్ అధికారి హనుమంతురావు, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆహార పదార్థాల తయారీలో నాణ్యత కరువు