ETV Bharat / state

'సెప్టెంబర్ నాటికి వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి'

author img

By

Published : Aug 14, 2020, 6:45 PM IST

ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు పనులు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ పోల భాస్కర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ నాటికి హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తవుతాయని కలెక్టర్ తెలిపారు. ముంపు గ్రామాల నిర్వహితులకు పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిర్వాసితులకు ఒకేసారి పరిహారం చెల్లిస్తామన్నారు.

'సెప్టెంబర్ నాటికి వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి'
'సెప్టెంబర్ నాటికి వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి'

వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో ప్రాజెక్ట్ పనులు పురోగతి, నిర్వాసితులకు పునరావాస కేంద్రాల ఏర్పాట్లపై ప్రాజెక్టు భూసేకరణ, ఇంజినీరింగ్, రెవెన్యూ, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

వెలుగొండ ప్రాజెక్ట్ పనులు, పునరావాసాలు ఏర్పాటు ప్రభుత్వం విధించిన గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ అన్నారు. 2020లో మొదటి టన్నెల్ ద్వారా నీటిని తెచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ పనులు కొల్లంవాగు వద్ద ముమ్మరంగా జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు. సెప్టెంబర్ 15 నాటికి హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి అవుతాయని పోల భాస్కర్ తెలిపారు. ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 31 నాటికి పునరావాస కేంద్రాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు.

నిర్వాసితులకు పునరావాస కేంద్రాల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు. వెలిగొండ ప్రాజెక్టు ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులు నిర్వాసితుల విషయంలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. నిర్వాసితులకు ఒకేసారి పరిహారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఇదీ చదవండి : రాష్ట్ర ఖజానా వైకాపా ప్రభుత్వ బ్యాంకు కాదు: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.