ETV Bharat / state

అమూల్ పాలసేకరణపై కలెక్టర్ సమీక్ష - ప్రకాశంలోని రైతు భరోసా కేంద్రాల వద్ద పాల సేకరణకు చర్యలు

ప్రకాశం జిల్లాలో అమూల్ సంస్థ భాగస్వామ్యంతో ప్రభుత్వమే పాలు సేకరించనుంది. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యలపై.. కలెక్టర్ పోల భాస్కర్ సమీక్ష నిర్వహించారు. కావాల్సిన సామాగ్రితో.. పలు గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆయా విషయాలపై అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

prakasam collector review meet
సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్
author img

By

Published : Nov 19, 2020, 8:58 PM IST

అమూల్ సంస్థ ద్వారా ఈరోజు నుంచి ప్రయోగాత్మకంగా చేపడుతున్న పాల సేకరణలో.. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. అమూల్ భాగస్వామ్యంతో ప్రభుత్వమే పాలు సేకరించనున్న నేపథ్యంలో.. అధికారులు, సిబ్బంది యంత్రం మాదిరిగా పని చేయాలన్నారు. సీఎం జగన్.. ఈ నెల 26వ తేదీన అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. 201 రైతు భరోసా కేంద్రాల వద్ద.. రేపటి నుంచి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రజల సిద్ధపాటు:

అమూల్​ సంస్థకు పాలు విక్రయించడానికి బుధవారం నాటికి.. 6,201 మంది మహిళలు ముందుకు వచ్చారని కలెక్టర్ వివరించారు. రేపు ఏడు వేల మంది మహిళల నుంచి పాలు సేకరించడానికి అధికారులు, సిబ్బంది సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం 141 మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఏర్పడ్డాయన్నారు. మహిళలను చైతన్య పరచడానికి ఎంపిక చేసిన గ్రామాలలో.. నూరు శాతం గ్రామ సభలు నిర్వహించామన్నారు. నిర్ణయించిన 20 మార్గాల్లో.. పాల సేకరణ కోసం 950 క్యాన్లను సిద్ధం చేశామన్నారు. గ్రామాల నుంచి సేకరించిన పాలను.. ఒంగోలు డెయిరిలో నిల్వచేయడానికి యుద్ధ ప్రాతిపదికన యంత్రాలు, పైప్ లైన్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. సంస్థ ద్వారా పాల ఉత్పత్తుల తయారికి తగిన ఉష్ణోగ్రత ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు:

యంత్రాలు, పరికరాల ఏర్పాట్ల కోసం రూ. ఏడు లక్షల కావాలని.. ఒంగోలు డెయిరీ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ నిధులను కేటాయిస్తూ.. రెండు రోజుల్లో వాటిని అమర్చాలని ఆదేశించారు. అమూల్ సంస్థ నిర్ణయించిన సమయంలోనే పాల సేకరణ జరిగేలా సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద పాల సేకరణ అనంతరం.. పారదర్శకంగా నగదు చెల్లింపులకు ఏర్పాట్లు చేయాలన్నారు. పాడి రైతులకు మేలు జరిగేలా.. 'ఆటోమాటిక్ బిల్ కలెక్షన్' నడిచేలా చూడాలన్నారు.

ఆర్​బీకేల్లో సదుపాయాలు:

రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్న పాల సేకరణ కేంద్రానికి.. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భాస్కర్ సూచించారు. కంప్యూటర్, యూపీఎస్ బ్యాటరీ, ప్రింటర్, పాల నాణ్యతను కొలిచే యంత్రాలు.. ఆర్​బీకేల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. అమూల్ సంస్థ రూపొందించిన సాఫ్ట్​వేర్​లో.. పాల ఉత్పత్తి దారుల సంఘంలోని సభ్యుల వివరాలను పొందుపరచాలన్నారు. ఆ సాఫ్ట్​వేర్​ను ఆయా కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడానికి.. గుజరాత్​కు చెందిన ఎవరెస్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీ నుంచి 16 మంది ఇంజినీర్లు ఒంగోలు డెయిరిలో పనిచేస్తున్నారని తెలిపారు. సహకార సంఘాల బ్యాంకు ఖాతాలను సాఫ్ట్​వేర్​లో నమోదు చేయాలన్నారు. అమూల్ సంస్థ ద్వారా పాల ఉత్పత్తుల సేకరణ గాడిలో పడేవరకు.. ప్రత్యేక దృష్టి సారించి బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు.

సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్

ఇదీ చదవండి: ఆసరా, చేయూత కింద పాడి పశువుల పంపిణీ: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.