ETV Bharat / state

'రాజీనే రాజ మార్గం..లోక్ అదాలత్​లో వివాదాలు పరిష్కరించుకోండి'

author img

By

Published : Dec 12, 2020, 8:40 PM IST

ప్రకాశంలోని జిల్లా కోర్టు కార్యాలయంలో జాతీయ లోక్​ అదాలత్​ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ పోల భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టాల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లోక్ అదాలత్​ ద్వారా అందరికీ న్యాయాన్ని చేరువ చేసే విధంగా పని చేస్తున్నట్లు.. జిల్లా న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి తెలిపారు.

national lok adalat
జాతీయ లోక్ అదాలత్

ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైనదని ప్రకాశం కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన.. జాతీయ లోక్ అదాలత్​లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. న్యాయవ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ద్వారా.. ప్రజా వివాదాల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. చట్టాల గురించి ప్రజలకు పూర్తిగా తెలియక అనవసరంగా కేసులు పెరుగుతున్నాయని.. వాటిపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తే.. సివిల్ కేసులు చాలా వరకు తగ్గుతాయన్నారు. ఆస్తులు, వినియోగదారులకు సంబంధించిన తగాదాలు ఎక్కువగా వస్తండగా.. వాటిని నియంత్రించగలిగితే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందన్నారు.

న్యాయాన్ని అందరికీ చేరువ చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు.. న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి తెలిపారు. 'దిగులు ఎందుకు దండగ - న్యాయ సేవా సంస్థ ఉండగ' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. లోక్ అదాలత్ ద్వారా రాజీపడదగిన కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని వివరించారు. బాధితులకు పరిహారం అందించే పథకం కింద.. 4 కేసుల్లో ఆయా వ్యక్తులకు ఆర్థిక సహాయ పత్రాలను అందించారు.

రాజీపడదగిన కేసుల పరిష్కారం కోసం జిల్లాలో 22 బెంచ్​లు ఏర్పాటు చేశామని.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. శ్రీనివాసరావు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ.. లోక్ అదాలత్​ను వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని.. ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోహార్ రెడ్డి తెలిపారు. కక్షిదారులు ఇద్దరూ మాట్లాడుకొని రాజీపడి.. వివాదాలను లోక్ అదాలత్​లో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

మాజీ ఎమ్మెల్యేను నాకే దిక్కు లేదు: ఉగ్ర నరసింహారెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.