ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు.
మార్కాపురం
మార్కాపురంలో పురపాలక ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 35 వార్డులు ఉండగా 5 వార్డులు ఏకగ్రీవమయ్యాము. మిగిలిన 30 వార్డులకు 117 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటికి గాను 60 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. నాలుగు వందల మంది పోలీసు సిబ్బందిని వినియోగించనున్నట్లు ఓఎస్డీ దౌదేశ్వరి స్పష్టం చేశారు.
కనిగిరి
కనిగిరి నగర పంచాయతీలో ఎన్నికల నిర్వాహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అందజేసి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 13 వార్డులకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలు జరగకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
చీరాల
చీరాల పురపాలక సంఘంలో మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు... 33 వార్డుల్లో మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 30 వార్డులకు 60 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో పోలింగ్ సామగ్రిని, బ్యాలెట్ బాక్సులను తరలించారు.
ఇదీ చదవండి