ప్రకాశం జిల్లా లోని బెస్తవారిపేట మండలం గలిజేరుగుల్ల, జేబీ కృష్ణాపురం గ్రామాల అటవీ ప్రాంతాల పరిధిలో.. నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.
అప్పటికే తయారైన 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను ఆదుపులో తీసుకున్నట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: