ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించారు. కంభం ఎస్ఈబీ సీఐ రమేష్, ఎస్ఐ నగేష్ల అధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, అయిదు లీటర్లు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీచదవండి.