మార్కాపురం జిల్లా కోసం మార్కాపురం నుంచి సచివాలయం వరకు ఐకాస నాయకులు తలపెట్టిన సైకిల్ యాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. యాత్రకు మద్దతుగా బయలుదేరిన తెదేపా నాయకులతోపాటు పలువురు జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని స్థానిక నాయకులు 55 రోజులుగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సైకిల్ యాత్రకు సిద్ధమయ్యారు. దీంతో మార్కాపురంలో పోలీసులు భారీగా మోహరించారు.
Interrupted Cycle Yatra యాత్ర సందర్బంగా ఇంటి నుంచి బయల్దేరిన తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో పాటు పలువురు ఐకాస నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతల అరెస్టు గురించి తెలుసుకున్న జేఏసీ నాయకులు.. ఐకాస నాయకులను తరలిస్తున్న పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు. నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, జేఏసీ నాయకులకు మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో జేఏసీ నాయకులను స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: