chemical powder used in drugs: బయటనుంచి చూస్తే అదొక పారిశ్రామిక గోడౌన్... కానీ అందులో మాదకద్రవ్యాల ముడి సరుకు నిల్వ చేస్తారు. చెన్నై నుంచి తెచ్చి ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో చెన్నైలో తీగలాగితే ఒంగోలులో డ్రగ్స్ డొంక కదిలింది.
chemical powder used in drugs: ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నిషేధిత మత్తు పదార్థాల తయారీ స్థావరంపై సోమవారం రాత్రి చెన్నై పోలీసులు దాడి చేశారు. పారిశ్రామికవాడలోని గోడౌన్ వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గోడౌన్‌ను సీజ్ చేశారు. అక్కడ నిషేధిత పదార్థమైన మెథాంఫెటమైన్ అనే డ్రగ్‌ను గుట్టుగా తయారు చేసి ప్యాకెట్ల రూపంలో... ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎలా బయటపడిందంటే...
chemical powder used in drugs: ఆరు రోజుల క్రితం చెన్నైలో మెథాంఫెటమైన్ డ్రగ్ తీసుకుంటున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఎక్కడ నుంచి వచ్చింది..? ఎవరు సరఫరా చేస్తున్నారు..? అనే కోణంలో వారిని విచారించారు. ఆ సమయంలో ఒంగోలు తయారీ కేంద్రం గుట్టు బయటపడింది. దీని మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు సమాచారం. మత్తుపదార్థాలు బయటపడిన కేంద్రంలో రెండేళ్ల క్రితం వరకు ఒంగోలుకు చెందిన పెంట్యాల బ్రహ్మయ్య అనే వ్యక్తి విస్తరాకుల తయారీ నిర్వహించేవాడు. విజయ్, వెంకటరెడ్డి అనే వ్యక్తులు దీన్ని అద్దెకు తీసుకున్నారు. అప్పటినుంచి ఎవరికీ అనుమానం రాకుండా మాదకద్రవ్యాలు తయారుచేసి చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.
కెమికల్ ల్యాబ్‌కు రసాయన పౌడర్...
చెన్నై నుంచి వచ్చిన పోలీసులు ఒంగోలులో దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్డీవో, డ్రగ్ కంట్రోల్ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒంగోలు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌లో రెండేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన విజయ్, వెంకట రెడ్డిలు ఓ గౌడన్‌ను అద్దెకు తీసుకుని పౌడర్ ప్యాకెట్లు తయారు చేస్తున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. వీటిని చెన్నై సహా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారని చెప్పారు. సంఘటన స్థలంలో దొరికిన రసాయన పౌడర్‌ను కెమికల్ ల్యాబ్‌కి పంపామని చెప్పారు. వీటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
ఇదీ చదవండి:
Women SHO: హైదారాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారి... మహిళా ఎస్‌హెచ్‌వో