ETV Bharat / state

యువకుడి హత్య కేసు.. నిందితులు అరెస్ట్ - prakasam dst murders news

ప్రకాశం జిల్లా చీరాలలో నడిరోడ్డుపై యువకుడిని కత్తితో నరికి చంపిన కేసుకు సంబంధించి.. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

police arrested murder victims in prakasam dst chirala

author img

By

Published : May 24, 2020, 6:03 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం సమీపంలోని కృపానగర్ వద్ద పట్టపగలు జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 8వ తేదీన చీరాల హారీస్ పేటకు చెందిన దినేష్ (20) అనే యువకుడిని కృపానగర్ వద్ద కత్తితో నరికి చంపారు. కేసు నమోదు చేసుకున్న చీరాల రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నలుగురు నిందితులను పట్టణానికి సమీపంలోని ఆటోనగర్ వద్ద అరెస్టు చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రేమ వ్యవహారం కారణంగానే...

చీరాలకు చెందిన దినేష్... గుంటూరు జిల్లా వెదుళ్ళపల్లికి చెందిన యువతితో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు దినేష్ ను హెచ్చరించారు. అయినా.. దినేష్... ఆమె ఇంటి వైపు వెళ్లగా.. కుటుంబసభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువతి స్నేహితురాలితో దినేష్ కు ఫోన్ చేయించి వెదుళ్ళపల్లి రావాలని చెప్పారు. చీరాల నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరిన అతడిని.. ఈపురుపాలెం గ్రామం సమీపంలోని కృపానగర్ కు చేరుకోగానే.. ఒక్కసారిగా కత్తితో గొంతుపై పొడిచి పరారయ్యారు. తీవ్రగాయాలైన దినేష్... అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇదీ చూడండి:

ప్రాణం తీసిన లైంగిక వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.