ETV Bharat / state

సింగరాయకొండ: మీడియా ప్రతినిధులు అరెస్టు - సింగరాయకొండ దేవస్థానం విషయంలో మీడియా ప్రతినిధులు అరెస్టు న్యూస్

ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారంలోని దేవతా ప్రతిమల చేతులు విరిగి ఉండటంపై అసత్య ప్రచారం చేశారంటూ నమోదైన కేసులో పలువురు మీడియా ప్రతినిధులను అరెస్టు చేసినట్లు జిల్లా ఏఎస్పీ బి.రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

సింగరాయకొండ ఘటనలో మీడియా ప్రతినిధుల అరెస్టు

author img

By

Published : Jan 7, 2021, 12:10 PM IST

సింగరాయకొండలోని శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారానికి మరమ్మతులు చేయకపోవటంతో సిమెంటు ప్రతిమల పెచ్చులూడాయని, అయితే వాటిని ఎవరో ధ్వంసం చేసినట్లు ఒక వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడని ఏఎస్పీ బి.రవిచంద్ర తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా దీన్ని మీడియా ప్రతినిధులు తమ ఛానళ్లు, పత్రికల్లో ప్రసారం చేశారని చెప్పారు. దాంతో కొందరు దురుద్దేశపూర్వకంగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌లోనూ పోస్టు చేశారని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.

అందుకు కారకులైన లారీ డ్రైవర్‌ మద్దాసాని మౌలాలితోపాటు వివిధ ఛానళ్లు, పత్రికల విలేకర్లు అంబటి శివకుమార్‌, సాగే శ్రీనివాసరావు, పోకూరి కిరణ్‌, షేక్‌ బాషు, కాట్రగడ్డ రామ్మోహన్‌లను అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు. వీరితోపాటు మరికొన్ని ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులపైనా కేసులు నమోదు చేశామనీ, వారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కేసులు ఉపసంహరించుకోండి: ఏపీయూడబ్ల్యూజే

తమ దృష్టికి వచ్చిన సమాచారాన్ని ప్రసారం చేసిన మీడియా ప్రతినిధులను అరెస్టు చేయటం సమంజసం కాదని ఏపీయూడబ్ల్యూజే బృందం అభ్యంతరం వ్యక్తంచేసింది. వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఏఎస్పీ రవిచంద్రను కలిసి డిమాండ్‌ చేసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏఎస్పీని కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

ఇదీ చదవండి:

చలో రామతీర్థం: తోపులాటలో సొమ్మసిల్లిన వీర్రాజు, విష్ణు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.