ఆటోలలో ప్రయాణిస్తూ దొంగతనానికి పాల్పడుతున్న ఓ మహిళను ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 22 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పందిళ్లపల్లి నుంచి వేటపాలెంకు వైదేవమ్మ అనే మహిళ ఉన్న ఆటోలో వచ్చింది. సదరు మహిళ పండ్ల కోసం పందిళ్లపల్లి గ్రామ సెంటర్లో బ్యాగు ఆటోలో ఉంచి పండ్లు కొనుగోలు చేసి వేటపాలెంకు ఆటోలో వచ్చింది. ఇంటికి వచ్చిచూసుకున్న వైదేవమ్మ.. బ్యాగులో ఉండాల్సిన బంగారం లేకపోవటంతో వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసింది.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు... సి.సి పుట్టేజీని పరిశీలించారు. ఆమెతో పాటు పందిళ్లపల్లిలో ఆటో ఎక్కిన ఓ మహిళ దొంగతనం చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. గాలింపు చర్యలు చేపట్టి చీరాల నల్లగాంధీబొమ్మ కూడలిలో ఆడినారాయనపురానికి చెందిన కావాటి వరలక్ష్మీ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.
ఇదీ చదవండి :