ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం మంగళమాణ్యంలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణించిన వ్యక్తి సౌలు(28)గా పోలీసులు గుర్తించారు. మృతుడు మద్యానికి బానిసై... మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారు. శనివారం రాత్రి ఇంటిపై కప్పుకు ఉన్న ఇనుప పైపుకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. తండ్రి రవికుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై శివనారాయణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి :