PROTEST: ప్రకాశం జిల్లాలోని పామురు మండల పరిషత్ కార్యాలయం వద్ద పింఛన్‌దారులు ఆందోళనలు నిర్వహించారు. అన్యాయంగా 36 మంది వృద్దాప్య,చర్మ, డప్పు కళాకారుల పింఛన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వాలంటీర్‌ను లబ్ధిదారులు ప్రశ్నించగా.. మరణించినట్లు నమోదు కావడంతో పింఛన్ నిలిపివేశారని సమాధానమిచ్చాడు. అనంతరం మరణించారంటూ పింఛన్లు తొలగించిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. దీనిపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బతికుండగానే మరణించినట్లు సృష్టించి పింఛన్ తొలగించారని ఆరోపించారు. మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తే ఎల్‌ఐసీ క్లెయిమ్ చేసుకుంటామని బాధితులు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారి లేకపోవడంతో పింఛన్ తొలగింపుదారులు బయటే వేచి ఉన్నారు.
ఇవీ చదవండి: