ETV Bharat / state

ఆరోగ్యంపై శ్రద్ధ... ఆర్గానిక్​ ఉత్పత్తులకు గిరాకీ - ప్రకాశం జిల్లా వార్తలు

కరోనా... ప్రజల జీవన విధానాన్ని మార్చేసింది. వ్యక్తిగత శుభ్రత నుంచి తినే తిండి వరకూ అనేక మార్పులు వచ్చాయి. కొవిడ్​ వంటి వ్యాధులను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి ముఖ్యమని తెలుసుకున్నారు. తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టారు. ప్రధానంగా కూరగాయలు, ఆకుకూరలు నాణ్యమైనవి, రసాయనాలు వినియోగం లేనివి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా... ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం ద్వారా సాగుచేసిన పంటలకు గిరాకీ పెరిగింది. ప్రకృతి వ్యవసాయం చేసే రైతాంగానికి చేయూత లభిస్తోంది.

ఆరోగ్యంపై శ్రద్ధ ...ఆర్గానిక్​ ఉత్పత్తులకు  గిరాకీ

author img

By

Published : Jun 7, 2020, 8:29 PM IST

కరోనా వైరస్‌ కారణంగా ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. వైరస్​ బారిన పడకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్లలో లభించే ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తుల వినియోగానికి మోగ్గుచూపుతున్నారు. ఫలితంగా.. ప్రకృతి , సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు లాభాల బాటపడుతున్నారు. పంటంతా అమ్ముడుపోతుండడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన నాయుడు మాల్యాద్రి, ప్రకృతి సేద్యం చేసే రైతు. చీమకుర్తిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆకు కూరలు, కూరగాయలు సాగుచేస్తున్నారు. ఉత్పత్తి తక్కువుగా ఉన్నా, ఖర్చు లేని వ్యవసాయం అవ్వడం వల్ల ఆదాయం ఆశించిన స్థాయిలోనే ఉంటుందని మాల్యాద్రి తెలిపారు. గతంతో పోలిస్తే లాక్​డౌన్​లో ప్రకృతి సాగు ఉత్పత్తులకు మార్కెట్​ పెరిగిందని, ఆదాయం కూడా బాగుందని మాల్యాద్రి అంటున్నారు.

ప్రకృతి సాగు ద్వారా పండించిన పంటలు రైతు బజార్లకు వెళ్లకుండానే అమ్ముడుపోతున్నాయి. ఇంటివద్దనే విక్రయానికి పెడితే అపార్ట్​మెంట్లు, కాలనీ వాసులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. రసాయనాలు వాడిన కూరగాయలు, ఆకుకూరలు వల్ల రోగనిరోధక శక్తిని కోల్పోతున్నామని, రసాయనిక రహిత కూరగాయల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వినియోగదారులు చెబుతున్నారు. ప్రకృతి సేద్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగి, సహజసిద్ధమైన సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని రైతులు అంటున్నారు.

ఇదీ చదవండి:

విరామం ముగిసింది.. వేట మొదలైంది.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.