రాయితీ ఉల్లి కోసం జనం అవస్థలు రాష్ట్రంలో ప్రజలకు ఉల్లిపాట్లు తప్పడం లేదు. రాయితీ ఉల్లి కోసం ఒంగోలులోని రైతు బజార్ల వద్ద ప్రజలు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. సెలవు రోజు కావడం వల్ల రద్దీ ఎక్కువైంది. తమకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కడపలోనూ అదే పరిస్థితి..
ఉల్లి కోసం కడప జిల్లా రైతు బజార్ వద్ద ప్రజలు బారులు తీరారు. వృద్ధులు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రాయితీ ఉల్లి కోసం పడిగాపులు కాస్తున్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఉల్లి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
పోలీసు చెక్ పోస్టుకు పడింది.. వైకాపా రంగు..!