ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ భాజపా అధ్యక్షుడు శ్రీనివాసులు, భాజపా ఇన్ఛార్జ్ రమేష్.. ఇతర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. భాజపా తరఫున ఎస్ఈసీకి ఎన్ని లేఖలు రాసినా.. పట్టించుకోవటం లేదని ఆరోపించారు.
సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఓటర్లను మభ్యపెట్టి, భయపెట్టి.. అనుకూలంగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. చివరికి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సైతం ఓటర్లకు పంచిపెట్టారనీ.. ఇటువంటి దురదృష్టకరమైన వైఖరి ఎక్కడా చూడలేదని అన్నారు. మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు.. భాజపా, జనసేన పార్టీ సమన్వయంతో ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం: డీజీపీ