ప్రకాశం జిల్లా మార్టూరులో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి చెయ్యి విరిగి, తీవ్రంగా గాయపడ్డాడు. ఒంగోలు నుంచి పి.శ్రీనివాసరావు అనే వ్యక్తి గుంటూరు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. ఈక్రమంలో మార్టూరు స్వప్న హోటల్ సమీపంలో ఆగివున్న లారీని ఢీకొట్టాడు. విషయం తెలుసుకున్న మార్టూరు ఎస్ఐ శివకుమార్ క్షతగాత్రుడిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి...