ఇదీ చదవండి:
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం - కనిగిరిలో ఆస్తి తగాదాలతో ఆత్మహత్యాయత్నం
ఆస్తి విషయంలో తనకు న్యాయం జరగదేమో అనే భయంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఘటన వివరాలివి..!
ఆస్తి తగాదాల్లో న్యాయం జరగదని ఆత్మహత్యాయత్నం
ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కె.రామయ్య ఆస్తి గొడవల విషయంలో తనకు న్యాయం జరగదనే భయంతో పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి గొడవల నేపథ్యంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన రామయ్య తనకు న్యాయం జరగదనే ఆందోళనతో అక్కడే బలవన్మరణానికి యత్నించాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న రామయ్యను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి:
AP_ONG_01_05_AATHMAHATHYAATHNAM_AV_10190
రిపోర్టర్.. డి.మధుసూదనరావు
ఈటీవీ, కంట్రిబ్యూటర్, కనిగిరి.
( ) ప్రకాశం జిల్లా కనిగిరి పోలిస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి ఆత్మయాత్నం కు పాల్పడ్డాడు...కనిగిరి చెందిన కె.రామయ్య అనే వ్యక్తి పురులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.. అన్నదమ్ములమధ్య ఆస్తి గొడవలు నేపథ్యంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ లకు పిర్యాదు చేసుకున్నారు.. ఈ విషయం పై ఇరువర్గాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.. ఈరోజు ఉదయం పోలీస్టేషన్ కు వచ్చిన కె.రామయ్య ఆస్తివిషయంలో తనకు న్యాయం జరదనే భయం తో ఈ ఘాతుకానికి పడ్డాడు.. అపస్మారక స్థితిలో ఉన్న రామయ్యాను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు... చికిత్స పొందుతున్నాడు...
TAGGED:
latest news in kanigiri