ETV Bharat / state

పెళ్లి విందులో ఘర్షణ..వధువు బంధువుపై గొడ్డలితో దాడి..మృతి - ప్రకాశం జిల్లా నేరాలు

ప్రకాశం జిల్లా నర్సమందాపురంలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. వధువు మేనమామపై వరుడి తరఫు బంధువులు గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.

one man death in a assault in narsamandapuram krishna district
విందుభోజనం విషయంలో ఘర్షణలో మృతి చెందిన వ్యక్తి
author img

By

Published : Aug 21, 2020, 8:01 PM IST

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలోని నర్సమందాపురం గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. విందు భోజనాల సమయంలో రేగిన చిన్న గొడవ కారణంగా... వరుడి తరఫు బందువులు వధువు మేనమామ మన్నేపల్లి సురేష్​పై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో సురేష్ తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వైద్య చికిత్స నిమిత్తం కనిగిరికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

నెల్లూరులో విషాదం... రైలు కింద పడి తండ్రీకొడుకులు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.