నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని రాజుపాలెం శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల అన్యాక్రాంతంపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ పూర్ణచంద్రరావు, అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి, స్థానిక దేవాలయం ఎండోమెంట్ ఆఫీసర్ రవీందర్ రెడ్డిలతో కూడిన అధికారుల బృందం విచారణ చేపట్టింది.
నాలుగు కోట్ల రూపాయల విలువైన స్వామి వారి భూములు కబ్జాకు గురయ్యాయన్న ఫిర్యాదుతో అధికారులు విచారిస్తున్నారు. ఈ భూములను 1934లో ఆలయానికి ఇవ్వగా, అప్పటి నుంచి ఆలయ ట్రస్ట్ మెంబర్లు కౌలుకు తీసుకొని వ్వవసాయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో భూముల ధరలు భారీగా పెరగడంతో 2014లో ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు తమ పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
ఇదీచదవండి.