నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఒంగోలులోని కలెక్టరేట్ ముందు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నేకునాంబాద్ గ్రామస్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్వతంత్ర ఎస్సీ అభ్యర్థి ఆళ్లగడ్డ విజయమ్మ సర్పంచ్‌గా పోటీ చేయగా.. 3ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు.
దీనికి కారణం నాన్ లోకల్ అయిన వేరేవాళ్లు ఓట్లు వేయడంతో తమ అభ్యర్థి ఓడిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం సంబంధిత పోలీసు అధికారులకు చెప్పినా ఎటువంటి స్పందన లేదని..పైగా పోలింగ్ బూత్ నుంచి వెళ్లకపోతే బైండోవర్ కేసులు పెడతామని పోలీస్ సిబ్బంది భయబ్రాంతులకు గురి చేశారని విజయమ్మ ఆరోపించారు. దీనిపై కలెక్టర్ కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. వెంటనే నాన్ లోకల్ వాళ్లను గుర్తించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: