ETV Bharat / state

ఐడియా అదరహో... ప్రతిభ చాటిన విద్యార్థినిలు..! - చీరాలలో ఎల్ఈడీ బల్బులతో జాతీయ జెండా

తమలో ఉన్న సృజనాత్మకతను, దేశభక్తిని ప్రదర్శించారు విద్యార్థినిలు. ఎల్​ఈడీ బల్బులతో జాతీయ జెండాను రూపొందించారు. ప్రతిరోజు రాత్రివేళ కళాశాలలో త్రివర్ణ జెండా తెర వెలిగేలా రూపకల్పన చేశారు. ఇంతకీ ఎవరా విద్యార్థులు.. మీరు చూడండీ..!

led bulb national flag
ఎల్ఈడీ బల్బులతో జాతీయ జెండా
author img

By

Published : Jan 26, 2020, 8:41 PM IST

ఐడియా అదరహో... ప్రతిభ చాటిన విద్యార్థినిలు..!

అక్కడి విద్యార్థినిలు కేవలం చదువుకే పరిమితం కాలేదు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారు. జాతీయ నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ... దేశభక్తిని పెంచుకుంటున్నారు. వారే ప్రకాశం జిల్లా చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిలు.

పాలిటెక్నిక్ మెుదటి సంవత్సరం చదువుతున్న ఈసీఈ, ట్రిపుల్ఈ విద్యార్థినిలు తమ మేథస్సుకు పదునుపెట్టి ఎల్ఈడీ బల్బులతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. వారంరోజుల పాటు కష్టపడి 7 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో జాతీయ జెండాను తయారు చేశారు. చెన్నై నుంచి సామగ్రిని కొనగోలు చేసి ఈ తెరను తయారు చేసినట్లు విద్యార్థినులు వివరించారు. 4 వేల ఎల్ఈడీ బల్బులు వినియోగించినట్లు తెలిపారు.

జాతీయ జెండా తయారీలో ఆయా విభాగాల ప్రతినిధులు విద్యార్థినులకు సూచనలిస్తూ... పనులను పర్యవేక్షించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు కళాశాల యాజమాన్యం వివరించింది. ఇందుకు అనుగుణంగానే కళాశాలలో మహాత్మాగాంధీ జీవిత విశేషాలను తెలిపేలా ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థినిలు తయారుచేసిన త్రివర్ణ తెర ప్రతిరోజు కళాశాలలో వెలుగులు విరజిమ్మేలా చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.