ETV Bharat / state

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏనుమాలేరు..స్థానికుల్లో ఆనందం

నల్లమల అటవీ ప్రాంతంలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో గుండ్లమోటు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఏనుమాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

author img

By

Published : Sep 20, 2019, 5:17 PM IST

nallamala-forest-latest
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏనుమాలేరు

నల్లమల అటవీ ప్రాంతంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... ప్రకాశం జిల్లాలోని గుండ్లమోటు ప్రాజెక్టు నిండింది. గిద్దలూరు మండలం వెంకటాపురం వద్దనున్న గుండ్లమోటు ప్రాజెక్టు నిండి నీరు దిగువకు పారుతోంది. దీనివల్ల ఏనుమాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత ఆరేళ్లలో వాగు ఇంత నిండుగా ఎప్పుడూ ప్రవహించలేదని స్థానికులు తెలిపారు. వాగు ప్రవహించే 70 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Intro:తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో లారీ,ఆటో,డ్రైవర్లకు 10వేల ఆర్థిక సహాయంపై అవగాహన సదస్సు.

Body:తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో లారీ,ఆటో డ్రైవర్లకు 10వేల ఆర్థిక సహాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు.దీని పై వారికి గల సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పర్వత ప్రసాద్,ఎంపీ గీతా విశ్వనాథం హాజరయ్యారు. అర్హులైన వారందరికి ఈ పథకం వర్తింపచెస్తామని ఎమ్మెల్యే అన్నారు. డ్రైవర్లు కూడా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదని సూచన ఇచ్చారు. ఇందులో లోటుపాట్లు ఏవైనా తలెత్తితే వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ పథకం కింద దాదాపు 4 లక్షల మందికి లాభం చేకూరుతుందని ఎం.పీ గీతా విశ్వనాథం అన్నారు. వాహనదారులతో అధికారులు దురుసుగా ప్రవర్తించకూడదనీ చెప్పారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.