ETV Bharat / state

చెత్త ఎత్తకుండానే చిత్తవుతున్న సేకరణ వాహనాలు.. - ప్రకాశం జిల్లాలో తుప్పు పడుతున్న చెత్త సేకరణ అటోలు

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో గ్రామాల్లో చెత్త సేకరణకు ఉపయోగించాల్సిన ఆటోలు నిరుపయోగంగా ఉంటున్నాయి. ఆరుబయటే ఎండా వానలోనే ఉంచడంతో తుప్పు పట్టి పనికి రాకుండా పోతున్నాయి

chetta bandi
chetta bandi
author img

By

Published : Dec 16, 2020, 2:25 PM IST

స్వచ్ఛ భారత్‌లో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రతను నెలకొల్పేందుకు చెత్త సేకరణ కోసం గత సార్వత్రిక ఎన్నికల ముందు మండలానికి 15 ఆటోలు మంజూరయ్యాయి. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అర్హులను ఎంపిక చేసి ఆటోలను అందిచాల్సి ఉంది. కాని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో అవి నిరుయోగంగా ఉంటున్నాయి.

ఒక్కో ఆటో విలువ సుమారు రూ.1.25 లక్షలు.. మొత్తం 15 ఆటోల విలువ రూ.18.75 లక్షలు. గ్రామాల్లో చెత్త సేకరణకు ఉపయోగించాల్సిన ఆటోలు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు సచివాలయ ఆవరణలో నిరుపయోగంగా ఉన్నాయి. ఆరుబయటే ఎండా వానలోనే ఉంచడంతో తుప్పు పట్టి పనికి రాకుండా పోతున్నాయి.

ఇదీ చదవండి:

'ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.