ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి ఆకురాతి పద్మిని ఇంటింటి ప్రచారం చేపట్టారు.
గడపగడపకూ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. సంక్షేమ పథకాల ఫలాలను ప్రతి పేదవానికి చేరుస్తుంది జగన్ ప్రభుత్వమేనని.. ప్రజలందరూ తమ పార్టీ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని మండల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
ఇదీ చదవండి:
వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఆదిమూలపు సురేశ్