పింఛన్లలో పొరపాట్లు జరిగితే సరిదిద్ధాల్సింది ప్రభుత్వమేనని... లేకపోతే ప్రజల్లో అబాసుపాలవుతారని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో పింఛన్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పింఛన్ల రద్దయిన బాధితులు ఎమ్మెల్యే కరణం బలరాంకు అర్జీలు అందజేశారు. అర్హులైనా తమకు పింఛన్ రద్దు చేయటం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పేరిట రెండు సెంట్లలో ఇల్లు ఉందని.. కొంతమందికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పింఛను రద్దు చేశారని వారు వాపోయారు. పింఛన్లు రద్దుతో అర్హులైన పేదలు ఇబ్బంది పడుతున్నారని.. ప్రభుత్వం పింఛన్ల విషయంలో పునరాలోచించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చెయ్యాలని ఎమ్మెల్యే బలరాం కోరారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: