ETV Bharat / state

MLA Balineni బార్‌ షాపులు అనుమతులను రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరా - ఏపీ తాజా వార్తలు

MLA Balineni ఒంగోలులో జరిగిన బార్‌ షాపుల వేలం పాటలో తన కుమారుడి పాత్ర ఉన్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. మద్యం షాపుల వేలంలో అన్ని పార్టీలు వాళ్లూ ఉన్నారన్నారు. జనసేన ఆరోపిస్తున్నట్లు తమ కుటుంబీకుల పాత్ర లేదని తేల్చిచెప్పారు. సంబంధిత బార్‌ షాపులు అనుమతులను రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరానన్నారు.

MLA Balineni
రాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
author img

By

Published : Aug 22, 2022, 7:46 PM IST

MLA Balineni ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల మద్యం షాపుల వేలం పాటలో వ్యాపారులు సిండికేట్‌ అయ్యారని, అందులో తన తనయుడు ప్రణీత్‌ రెడ్డి పాత్ర ఉందని వస్తున్న వార్తలపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. మద్యం షాపుల వేలంలో అన్ని పార్టీలు వాళ్లు ఉన్నారన్నారు. జనసేన ఆరోపిస్తున్నట్లు తమ కుటుంబీకుల పాత్ర లేదన్నారు. తమ పార్టీకి చెందిన వారికి రెండు, జనసేన పార్టీకి చెందినవారికి మూడు, తెదేపాకు తొమ్మిది షాపులు వచ్చాయని, ఈ లెక్కన ఎవరు ఎవరితో సిండికేట్‌ అయ్యారో అర్థమవుతుందని తెలిపారు. ఈ వ్యాపారం లొసుగులు లేకుండా చేస్తారా? అన్నారు. అందువల్ల ఈ మద్యం షాపులు అనుమతలను రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరామన్నారు. ఇప్పటికే వారు నగదు చెల్లించారని ఇప్పుడు రద్దు చేస్తే న్యాయస్థానానికి వెళతారని అధికారులు అంటున్నారన్నారు. అయినా ప్రభుత్వం తమది కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్లనీయండని తాను చెప్పానని, ఈ షాపులు రద్దు చేసేంతవరకూ ఊరుకోనని బాలినేని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.