ETV Bharat / state

'సీఎం జగన్​ నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోతుంది' - minister balineni latest news

ప్రకాశం జిల్లాలో మంత్రులు విశ్వరూప్​, బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఇంటింటికి రేషన్​ పంపిణీ వాహనాలను పారంభించారు. సీఎం జగన్​ తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి విశ్వరూప్ అన్నారు.

ministers vishwaroop and balineni srinivasareddy launched door-to-door ration distribution vehicles at ongolu
మంత్రులు విశ్వరూప్​, బాలినేని శ్రీనివాసరెడ్డి
author img

By

Published : Jan 21, 2021, 7:24 PM IST

పేదలందరికీ నాణ్యమైన బియ్యం, సక్రమంగా అందే విధంగా ముఖ్యమంత్రి జగన్​ మోహన్​రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి విశ్వరూప్‌ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియంలో ఇంటింటికి రేషన్‌ బియ్యం పంపిణీ వాహనాలను మంత్రులు విశ్వరూప్‌, బాలినేని శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు.

పేదల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న అంకిత భావానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తుందని విశ్వరూప్‌ అన్నారు. ఇంటింటికి రేషన్‌ బియ్యం కార్యక్రమం ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో సీఎం జగన్ ముందుంటారని మరోసారి నిరూపించారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పోల భాస్కర్‌, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

'హైకోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలకు వెళతాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.