ETV Bharat / state

మంత్రులుగా బాలినేని, ఆదిమూలపు ప్రమాణస్వీకారం - ministers

ప్రకాశం జిల్లా నుంచి పార్టీ అధినేతకు అత్యంత విశ్వాసపాత్రులుగా మెలిగిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. ఒంగోలు, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ రాష్ట్ర మంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేశారు.

ఆదిమూలపు, బాలినేని
author img

By

Published : Jun 8, 2019, 1:55 PM IST

పార్టీ ఆవిర్భావం నుంచి వైకాపా ఆదరిస్తూ వస్తున్న జిల్లాలో ప్రకాశం ఒకటి. అలాంటి జిల్లా నుంచి ఇద్దరికి మంత్రులుగా అవకాశం కల్పించారు ఆపార్టీ అధినేత జగన్. సచివాలయం వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
జిల్లాలో బాలినేనిదే హవా...

బాలినేని అను నేను
జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే బాలినేని. 1999 నుంచి 2014 వరకు (2012 ఉప ఎన్నికతో కలిపి) అయిదు ఎన్నికల్లో పోటీ చేసి నాలుగు సార్లు గెలుపొందారు. వైకాపా అంటే జిల్లాలో మొదట గుర్తుకు వచ్చే పేరు ఈయనదే. అటు పశ్చిమాన, ఇటు తూర్పున కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆయనంటే అభిమానమే. వైకాపా ఆవిర్భావం నుంచి జిల్లాలో ఈయన కీలకంగా పనిచేశారు. నాడు మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని వదులుకుని జగన్‌తో జత కట్టి 2012లో ఉప ఎన్నికలకు వెళ్లి గెలుపొందారు. 2014లో ఎన్నికలకు ముందు టిక్కెట్ల కేటాయింపు మొదలు అన్ని విషయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కాస్త దూరమైనప్పటికీ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకున్నారు. గత ఏడాది జిల్లాలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర నుంచి బాలినేని కూడా జిల్లాలో చురుకయ్యారు. తన వెంట వచ్చే వారిని కలుపుకొంటూ, తన పాత వర్గీయులను పార్టీలో చేర్చుకుని ఎన్నికలకు వెళ్లారు. భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
పార్టీ వాదనను సమర్థంగా వినిపించి...
ఆదిమూలపు సురేష్ ప్రమాణం
పార్టీ పట్ల విధేయుడిగా, పార్టీ వాదనను సమర్థంగా వినిపించిన మరో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌. వరుసగా మూడు ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో యర్రగొండపాలెం నుంచి, 2014లో సంతనూతలపాడు నుంచి, 2019 ఎన్నికల్లో మళ్లీ యర్రగొండపాలెం నుంచి విజయం సాధించారు. 2014లో గెలిచిన తర్వాత జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరినా సురేష్‌ వెళ్లలేదు. వైకాపాకు విధేయుడిగా ఉంటూ అటు శాసనసభలోనూ, ఇటు జిల్లా సమావేశాల సందర్భంగానూ తన గళం విప్పేవారు. ఉన్నత విద్యావంతుడు కావడం ఆయనకు కలిసి వచ్చిన విషయం

Prayagraj (Uttar Pradesh), June 08 (ANI): One Sub Inspector (SI) of the Uttar Pradesh police got injured in a raid in Prayagraj's Jasra Bazar on Friday. While speaking to ANI, Additional Superintendent of Police (SP) of Prayagraj, Deependra Nath Chaudhary said, "Several robbery incidents had taken place under the jurisdiction of Bara police station. The police had received information that the miscreants involved in this are present near a shop in Jasra Bazar." "When the police reached the spot, the miscreants saw them. The police chased them as they entered a house, where they were staying on rent. Later, the miscreants fired a shot and the women there started throwing bricks and stones at the police. A Sub Inspector has got injured in this incident. The miscreants later managed to run away from the spot," he added. The police have taken owners of the house into custody for interrogation. Further investigation is underway in this regard.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.