సుప్రీంకోర్టు (supreme court) ఆదేశాలను గౌరవిస్తూ..పది, ఇంటర్ పరీక్షలను (exams cancelation) రద్దు చేసామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(Minister Suresh) అన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా పది రోజుల్లో పరీక్షల తంతు ముగించాలని న్యాయస్థానం ఆదేశమివ్వగా..అది సాధ్యం కాకపోవటం వల్లే రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు.
కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ..విద్యార్థుల భవిష్యత్తు దృష్టా పరీక్షలు నిర్వహించాలనుకున్నాం. పరిస్థితులు అన్నీ చక్కబడ్డాక పరీక్షలకు ఏర్పాటు చేయాలని యోచించాం. అయితే జాతీయ విద్యావిధానం కారణంగా త్వరితంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని కోర్టు సూచించింది. అది సాధ్యం కాకపోవడం వల్లే పరీక్షలు రద్దు చేశాం -సురేశ్, విద్యాశాఖ మంత్రి
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (lokesh) పరీక్షల రద్దు విషయాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ..విద్యార్థుల భవిషత్తుతో రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. తాము నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది విద్యార్థులు పరీక్షలు నిర్వహించాలనే కోరారన్నారు.
ఇదీచదవండి
Exams Cancelled: పది, ఇంటర్ పరీక్షలు రద్దు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం