ప్రజల సంక్షేమం కోసం ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని మంత్రి నివాసంలో అనందయ్య మందును పంపిణీ చేశారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికే రెండుసార్లు ఆనందయ్య మందును అందించామన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో మందు పంపిణీ పూర్తయ్యాక ఇతర నియోజకవర్గాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి మందు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీచదవండి.