ETV Bharat / state

గుండ్లకమ్మ గేటు దుస్థితికి గత ప్రభుత్వమే కారణం..మంత్రి అంబటి - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

Minister Ambati Rambabu on Gundlakamma: దెబ్బతిన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌ గేటును మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. జలాశయంలోని నీటి మట్టం తగ్గితే కానీ స్టాప్‌ లాక్‌ గేటు ఏర్పాటు చేయడం సాధ్యంకాదని మంత్రి స్పష్టం చేశారు. ఐదారేళ్లుగా గేట్లు తప్పుపట్టిపోయాయని... గత ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.

Minister Ambati Rambabu
మంత్రి అంబటి రాంబాబు
author img

By

Published : Sep 3, 2022, 12:32 PM IST

Minister Ambati Rambabu: ఇటీవల దెబ్బతిన్న గుండ్లకమ్మ రిజర్వాయ్లను భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సుధాకర బాబు, జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో స్పిల్ వే రెగ్యులేటర్ గేట్లను పరిశీలించారు. గేట్ దెబ్బ తినడంతో జలాశయంలో నీళ్లు బయటకు పోయాయని... దాదాపు రెండు టీఎంసీల నీటిని విడిచిపెడితే గానీ స్పాట్ లాక్​లు ఏర్పాటు చేయడం సాధ్యంకాదని మంత్రి అంబటి పేర్కొన్నారు. ఈ గేట్లేమీ నిన్న మొన్న కొట్టుకు పోలేదని... ఐదారేళ్లుగా తుప్పు పట్టి ఈ రోజు ఇలా దెబ్బ తిన్నాయన్నారు. గత ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు..

ఈ ప్రోజక్ట్ కోసం గత ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి అంబటి అన్నారు. ఆ డబ్బుతో డ్యాం సుందరీకరణ, గెస్ట్ హౌస్ కోసం ఖర్చు చేశారు తప్ప... మరమ్మత్తుల కోసం ఖర్చు చేయలేదని చెప్పారు. కమీషన్ కోసం ఆ నిధులు ఖర్చుచేశారని ఆరోపించారు. గుండ్లకమ్మ స్పిల్ వే రెగ్యులేటర్ గేట్లు మరమ్మతు త్వరలో ప్రారంభిస్తాని తెలిపారు. పనులు చేపట్టాలంటే 2 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడిచి పెట్టక తప్పదన్నారు.
మరమ్మతులు పూర్తయ్యాకా సాగర్ నుంచి నీటిని మళ్లించి, గుండ్లకమ్మ జలాశయాన్ని నింపుతామని పేర్కొన్నారు. ఖరీఫ్​కు నీటిని అందిస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు.

" గేటు దెబ్బతిని జలాశయంలో నీళ్లు బయటకు పోయాయి. ఐదారేళ్లుగా తుప్పుపట్టి ఉండటంతో గేటు దెబ్బతింది. గేట్ల మరమ్మతు త్వరలో ప్రారంభిస్తాం. 2 టీఎంసీలు సముద్రంలోకి వదలక తప్పదు. ఖరీఫ్‌కు సాగర్ నుంచి నీరు మళ్లించి గుండ్లకమ్మ నింపుతాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." -మంత్రి అంబటి రాంబాబు

మంత్రి అంబటి రాంబాబు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.