ప్రధానితో మాట్లాడిన విద్యార్థిని పల్లవిని మంత్రి సురేశ్ అభినందించారు. పల్లవి పొదిలిలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఉపకార వేతనానికి ఎంపికైంది. ఈ నేపథ్యంలో విద్యార్థినికి ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం లభించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి సురేష్ మార్కాపురంలోని ఆయన నివాసంలో డీఈఓ సుబ్బారావుతో కలిసి విద్యార్థినితో పాటు ఆమె తల్లిదండ్రులను అభినందించి సన్మానం చేశారు. అనంతరం పల్లవికి మంత్రి టీవీ బహుకరించారు. భవిష్యత్తులో పై చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాక్షించారు.
ఇదీ చదవండి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఫలితం మిగిలింది