ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లోని వ్యవసాయ, ఉద్యానవన పంటల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన రైతులకు రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు కల్పించడానికి తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు నష్టపోకూడదన్నారు. పండించిన పంటలు అమ్ముకోవడానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. యర్రగొండపాలెంలో రైతు బజార్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.
ఇవీ చదవండి.. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్