ETV Bharat / state

మీసేవా కేంద్రాల వద్ద జనం బారులు..మరిచిన కొవిడ్​ నిబంధనలు - కొవిడ్ వ్యాప్తించే అవకాశాలు మెండు

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని మీసేవా కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆధార్​కు ఫోన్ నంబర్ అనుసంధానం అయితేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ప్రభుత్వం చెప్పడంతో ఈ పరిస్థితి నెలకొంది.

మీసేవ కేంద్రాల వద్ద బారులుదీరిన ప్రజలు
People are waiting at meeseva service centers in Prakasam
author img

By

Published : May 26, 2021, 6:01 PM IST

ఆధార్​కు ఫోన్ నంబర్ అనుసంధానం అయితేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ప్రభుత్వం చెప్పింది. దీంతో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని మీసేవా కేంద్రాల వద్ద ప్రజలు బారులుదీరారు. చీరాలలో మీ సేవ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో గుమిగూడారు. ఉదయం నుంచి క్యూలో ఉన్నామని పలువురు లబ్ధిదారులు అంటున్నారు. ఇలా అధిక సంఖ్యలో జనాలు గుమిగూడటంతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు.

చీరాల మండలంలోని కొన్ని గ్రామాల్లో మీసేవా కేంద్రాలు లేకపోవడంతో మీసేవ సెంటర్ వద్దే గంటలకొద్దీ ఉండాల్సి వస్తుందని పలువురు గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామ, వార్దు సచివాలయాల్లోనే ఆధార్​కు ఫోను నంబర్ అనుసంధానం చేసే విధంగా ఏర్పాటు చేస్తే తమకు ఈ ఇబ్బందులు తప్పుతాయంటున్నారు. అలాగే కొవిడ్ వ్యాప్తిని నిరోధించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి..

కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలి: జవహర్ రెడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.