ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామంలో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేసిన కరుణాకర్ రెడ్డిని 'దిశ చట్టం' కింద ఎందుకు శిక్షించడం లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. సామాజిక వర్గానికి ఒకలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందా అని ప్రశ్నించారు. అత్యాచార నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్ నుంచి మిర్యాలపాలెం అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కరుణాకర్ రెడ్డి , గుంటూరు జిల్లాలో నవీన్ రెడ్డి ముఖ్యమంత్రి సామాజిక వర్గం కాబట్టే కఠిన చట్టాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ పై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: