ETV Bharat / state

సింగర్​పల్లిలో వ్యక్తి బలవర్మరణం.. రాజకీయ దుమారం - బేస్తవారిపేట మండలం తాజా వార్తలు

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగర్​పల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని మరణంపై రాజకీయ దుమారం రేగుతోంది. సోమవారం వెంకయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. స్థానిక ఎమ్మెల్యే దూషించడం వల్లే అతను చనిపోయాడని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అతని మృతికి ఎలాంటి రాజకీయ సంబంధం బంధువులు స్పష్టం చేశారు.

man suicide creating political heat in singarpalli
బేస్తవారిపేట మండలం సింగర్​పల్లిలో వ్యక్తి బలవర్మరణం
author img

By

Published : Jan 18, 2021, 7:40 PM IST

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగర్​పల్లిలో బంగ్లా వెంగయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం గ్రామం నుంచి వెళ్తున్న వాహనాన్ని జనసేన నాయకులు అడ్డుకున్నారు. అక్కడే వెంగయ్య కూడా ఉన్నారు. అయితే సోమవారం ఉదయం వెంగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దూషించడం వల్లే బలవర్మరణానికి పాల్పడ్డని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.

  • రాజకీయం చేయొద్దంటున్న కుటుంబ సభ్యులు..

వెంగయ్య గతంలోనూ రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించాడని అతని బంధువులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం సింగర్​పల్లి గ్రామంలో జరిగిన సంఘటనకు అతనికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. మృతుడు తన స్వగ్రామం పామూరులో నివసిస్తూ లారీ డ్రైవర్​గా పని చేస్తున్నాడని.. ఇతను ఆత్మహత్యకు, ఎటువంటి రాజకీయ సంబంధం లేదని చెప్పారు. అసలు వెంగయ్య జనసేన నాయకుడే కాదని, వెంకయ్య మరణాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని వారి సోదరులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: సముద్రతీరంలోని వలలకు నిప్పంటించిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.