ETV Bharat / state

MURDER: మద్యం తాగుతుండగా ఘర్షణ.. కోపంతో దారుణ హత్య - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

murder
దారుణ హత్య
author img

By

Published : Aug 25, 2021, 2:55 PM IST

Updated : Aug 26, 2021, 10:00 AM IST

14:46 August 25

దారుణ హత్య

మద్యం తాగుతుండగా ఘర్షణ.. కోపంతో దారుణ హత్య

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్లలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కనిగిరి మండలం యడవల్లికి చెందిన వెంకటేశ్వరరావు, అతని అన్న కుమారుడు పుల్లారావుతో పెదారికట్లలోని ఒక మద్యం దుకాణానికి వెళ్లాడు. మద్యం తాగుతుండగా.. ఆస్తి విషయాలపై ఇద్దరి మధ్య..  మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో కోపోద్రికుడైన పుల్లారావు సీసాతో వెంకటేశ్వరరావును పొడిచాడు. తీవ్ర గాయాలు కావడంతో వెంకటేశ్వరావు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన తర్వాత నిందితుడు పుల్లారావు అక్కడే కాసేపు వీరంగం సృష్టించినట్లు స్థానికులు తెలిపారు. 

చంపింది నేనే..

హత్య చేసిన తర్వాత నిందితుడు పుల్లారావు అక్కడే కాసేపు వీరంగం సృష్టించాడు. మృతుడిని కూర్చోబెట్టి... జేబులో చేతులు పెట్టుకొని వెనకాల నిల్చున్నాడు. అక్కడున్న స్థానికులు అతన్ని ఎవరు చంపారని ప్రశ్నించగా... చంపింది తానేనని, తానేం పారిపోవటంలేదని నిందితుడు నిర్భయంగా సమాధానం ఇచ్చాడు. నీ వివరాలేంటి అని ఆరా తీయగా... ఆ వివరాలు మీకు అనవసరమని, తానేం పారిపోవటంలేదని సమాధానమిచ్చాడు. హత్యకు ఆస్తి వివాదాలే కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు

ఇదీ చదవండీ.. Jagan Bail cancel petition: జగన్ బెయిల్ రద్దు వ్యాజ్యంపై తీర్పు వాయిదా

Last Updated : Aug 26, 2021, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.