ETV Bharat / state

చీరాలలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - చీరాల తాజా వార్తలు

రాడ్ బెండింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది.

electrocution in cheerala
చీరాలలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : Oct 17, 2020, 12:43 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ఇస్లామ్​పేటకు చెందిన వి.రవితేజ రాడ్ బెండింగ్ పని చేస్తుంటాడు. దగ్గరలోని ఒక గృహ సముదాయంలో పని చేస్తుండగా.. కరెంట్ తీగలు కటింగ్ మిషన్​లో పడి విద్యుత్ ప్రసారం కావటంతో షాక్ కొట్టింది.. అపస్మారక స్దితిలోకి వెళ్లిన రవితేజను స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. చీరాల ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి. రాష్ట్రంలో కొత్తగా 3,967 కరోనా కేసులు, 25 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.