MAN BET WOMAN WITH SANDLE: పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న మహిళతో.. బండిలో పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చిన వ్యక్తికి మధ్య చిన్న గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో.. ఆ వ్యక్తిపై మహిళపై దాడికి దిగాడు. చెప్పు తీసుకొని ఆమెను కొట్టాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో జరిగింది. ఈ దృశ్యాలన్నీ పెట్రోల్ బంక్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
పందిళ్లపల్లికి చెందిన గుత్తి శ్రీనాథ్ తన తప్పేం లేకున్నా అసభ్యకరంగా బూతులు తిడుతూ.. తనను చెప్పుతో కొట్టి అవమానించాడని ఆ మహిళ.. వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:
7 DIED IN ROAD ACCIDENT: ఏడుగురిని మింగేసిన రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి..