ప్రకాశం జిల్లా జరగుమల్లి మండలం బిట్రగుంట వద్ద ఈ నెల 20న జరిగిన మాధవరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. తన ప్రియరాలితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, ఆమె తనను విడిచి వెళ్ళిపోవడానికి కారణంగా భావించి మాధవరెడ్డిని సింగరాయకొండకు చెందిన షేక్ అబ్దుల్ నిస్సార్ తన స్నేహితుడు షేక్ జిలానితో కలిసి హత్య చేసాడు. మృతుడికి నిందితులు ముగ్గురూ స్నేహితులే. కారు మెకానిక్ అయిన నిస్సార్ ప్రధాన నిందితుడు కాగా గతంలోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయి. ఇది అతనికి నాలుగో హత్య కేసు. అరకు లోయకు చెందిన ఓ మహిళతో సహజీవనం సాగిస్తున్న నిస్సార్, తన స్నేహితుడు మాధవరెడ్డి తరుచూ ఇంటికి వస్తుండటం, ఆ మహిళతో చనువు ఏర్పడి, అక్రమ సంబంధం కలిగి ఉండటాన్ని సహించలేకపోయాడు. ఈ నెల 20న మధ్యం సేవిద్దాం అంటూ మాధవరెడ్డిని తన కారుషెడ్డుకు తీసుకువచ్చి, హత్య చేసి బిట్రగుంట జాతీయ రహదారిపక్కన పడేసారు. తన ప్రియురాలు దూరం కావడానికి పైడిరాజు అనే వ్యక్తి ప్రమేయం ఉందని భావించి అతడిని కూడా హత్య చేసేందుకు పన్నాగం పన్నారు. అంతలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులిద్దరినీ పట్టుకొని అరెస్టు చేయడంతో పైడిరాజు ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. నిందితులిద్దరినీ అరెస్టు చేసామని ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌రావు తెలిపారు.
ఇదీ చూడండీ: రైల్వే వంతెనకు రబ్బర్లు బిగించాలని ఆందోళన